గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలుపులన్నింటినీ బంధించి,
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?
కళ్ళు తెరచి చూడు.
నీవు ఆరాధించే దేవుడు
నీ ఎదుట లేడు!
ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,
ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,
అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.
వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.
నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి
ఆనేల మీదికి పదా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి