9, జూన్ 2013, ఆదివారం

నా ప్రేమనేలనే విడిసివేశావు

చందన పువ్వంటి తనువు చేసి
విరజాజి పూల పలువరుస చేసి
వెలగ పువ్వంటి వీనులుచేసి
పువ్వులతో నీకు అంగములు చేసినవాడు
రాతితో ఏలనే మనస్సు చేశాడు
నిండువెన్నెల నేనాశించాను
అమావాస్యను నాకందించావు
స్వేచ్ఛ నేనాశించాను
శరణు నాకందించావు
రాగం నేనాశించాను
మౌనం నాకందించావు
ప్రేమామృతం నేనాశించాను
కన్నీటి కడలి నాకందించావు
వెన్నలాంటి మనస్సు నేనాశించాను
నిర్థయతో ముళ్ళు నాకందించావు
వెన్నెలవేళలో నిరీక్షించాను
నువ్వు నిద్రావస్థలోకి జారుకున్నావు
మనసంకితమివ్వగ వచ్చాను
నీ గుండెను శిలగా చేశావు
గుండె తలుపులు తెరచి వుంచాను
పిల్ల తెమ్మెరలు ఎందుకు నిలిపివేశావు
ఇరు చేతులు చాచి నిలిచాను
నీ హృదయ కవాటములు మూసివేశావు
కడలిలో విసిరిన పువ్వులాగా
నా ప్రేమనేలనే విడిసివేశావు
(‘ఇద్దరు’ సినిమాలోని అద్భుతమైన డైలాగ్)

బిడ్డల పాలకై బిక్షమెత్తు దేశంలో

బిడ్డల పాలకై బిక్షమెత్తు దేశంలో
రాళ్ళకు పాలిచ్చు కథ నశించునదెన్నడో
పేడకు బొట్టెట్టి దైవమని పూజించు వారు
పేదను గుర్తించగ మారబోవునదెన్నడో
ఎప్పుడొచ్చును దేశానికి చైతన్యం
అది తెచ్చుట కదా మన కర్తవ్యం

(‘ఇద్దరు’ సినిమాలోని అద్భుతమైన డైలాగ్)